హీరోలతో డేటింగ్ చేయడం అస్సలు నచ్చదు..!: సమీరారెడ్డి

బాలీవుడ్‌లో తన అందచందాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిన అందాల ముద్దుగుమ్మ సమీరారెడ్డికి సినీ ఫీల్డ్‌లో ఉన్న మగాళ్లంటే బొత్తిగా నచ్చదట. హీరోలు, మోడల్స్ అంటే అంతగా ఆసక్తి చూపనని, ముఖ్యంగా సినిమా నాయకులతో డేటింగ్ చేయడం అస్సలు నచ్చదని సమీరారెడ్డి ఓపెన్‌గా చెప్పేసింది. ఎందుకంటే..? తను కూడా సినిమావాడే కదా..? అందుకే బోర్ కొడుతుందని సమీరా మనసులోని మాటను బయటపెట్టేసింది. ఇంకా చెప్పాలంటే..? తనకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేవని అంటోంది. ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతానంటే..? అందమైన మనసున్న అబ్బాయిలంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. ఆత్మవిశ్వాసంతో బతికే మగాడంటే చాలా ఇష్టమని తన వరుడికి ఉండాల్సిన లక్షణాలను ఏకరువు పెట్టింది.పనిలో పనిగా ముసాఫిర్‌లో ముద్దు సీన్‌ గురించి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. అవేవీ పట్టించుకోకుండా ముద్దు గురించి ఎందుకింత శ్రద్ధ తీసుకుంటారంది. మనదేశంలోనే ఇలా అన్ని విషయాలను పట్టించుకుంటారని, విదేశాల్లో అసలు పట్టించుకోరని సమీరా కొట్టిపారేసింది. మరి.. సమీరారెడ్డి తగిన ఆ “ఒక్కమగాడు” ఎవరో వేచి చూడాల్సిందే..!?

About the Author

admin has written 106 stories on this site.

Write a Comment

Gravatars are small images that can show your personality. You can get your gravatar for free today!