రెండు నినాదాలు… జై తెలంగాణ, జై ఆంధ్ర! లక్ష్యం ఒక్కటే… రాష్ట్ర విభజన! ఈ లక్ష్యం కోసం ఉమ్మడి పోరాటం మొదలైంది. ఇప్పటిదాకా వేర్వేరుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర ఉద్యమ నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. ఒకరి ప్రాంతాల్లో ఒకరు పర్యటించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాలకూ మేలు జరుగుతుందనే వాదన వినిపించనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆయన వర్గీయులు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నారు. వైఎస్ హఠాన్మరణంతో ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సీఎం పగ్గాలు అప్పగిస్తారని అందరూ ఊహించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేదికపై ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు, మెదక్ ఎంపీ విజయశాంతిలు ఒకరిపై ఒకరు నర్మగర్భంగా విమర్శలు గుప్పించుకున్నారు. ఇది.. మిగిలిన పార్టీ నేతలకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, విజయశాంతిలు, తమ వంతు ప్రసంగాల సమయంలో ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నారు. ఇది పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.
సార్క సదస్సులో భాగంగా భూటాన్ రాజధాని థింపూలో భారత్, పాకిస్థాన్ దేశాల ప్రధానమంత్రుల మధ్య జరిగిన కీలక భేటీ ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. ఇకపై ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ముంబై దాడుల నేపథ్యంలో ఈ చర్చలు ఆగిపోయిన విషయం తెల్సిందే.
తెలంగాణ ఉద్యమం పేరుతో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు కోట్లాది రూపాయలు దండుకుని టీవీ ఛానల్ను పెట్టారని విజయవాడ ఎంపీ, సమైక్యాంధ్ర హీరో లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. హైదరాబాద్లో పోటీ చేసే సత్తా లేని కేసీఆర్.. దాడులు దందాలతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.